లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్‌సింగ్‌నాయక్
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): బీసీ కులగణనను తాము బహిష్కరిస్తున్నామని లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్‌సింగ్‌నాయక్ అన్నారు. శనివారం కామారెడ్డిలో మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు. లబాన లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుంచి తొలగించి లబాన జాతిగా గుర్తింపు ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సహకరించబోమని చెప్పారు. తెలంగాణలోని రాష్ట్రంలోని ఐదు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది లబాన లంబా డీలు ఉన్నారని తెలిపారు.
బీసీ కుల గణనలో లబాన లంబాడీలకు భాష, బీసీ కుల జాబితాలో గుర్తింపు ఇచ్చిన తర్వాత బీసీ కులగణన చేపట్టాలని, మతూర కులం నుంచి లబాన కులంగా గుర్తించాలని కోరారు.