calender_icon.png 26 December, 2024 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలీకి మేము వ్యతిరేకం

04-11-2024 01:38:07 AM

 టీవీకే అధిపతి దళపతి విజయ్

చెన్నై, నవంబర్ 3: దేశంలో జమిలీ ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని టీవీకే (తమిళిగా వెట్రి కగజం) అధినేత దళపతి విజయ్ ప్రకటించారు. ఆదివారం చైన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతలతో తొలిసారి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పార్టీని, పార్టీ జెండాను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై చర్చిం చారు. 26 తీర్మానాలను ఆమోదించారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమిళనాడు సీఎం స్టాలిన్, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.  రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి డీఎంకే అధినేత స్టాలిన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో కులగణనను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.

పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక గడువు పెట్టుకొని రాష్ట్రంలో వైన్ షాపులను క్రమంగా మూసివేయాలని కోరారు. తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హిందీకి చోటులేదన్నారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు  అమలు చేసే జమిలీ ఎన్నికలకు తాము వ్యతిరేకమని, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కోరారు.