అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భూగర్భగనుల శాఖ రెవెన్యూ శాఖల అనుమతులకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో మట్టి తవ్వకాలు యదేచ్చగా జరుగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతూ విక్రయాలు చేపడుతూ అక్రమ సంపాదనకు కొందరు యత్నిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్ మండలం చిరకుంట మార్గంలోనీ పోచమ్మ ఆలయ సమీపంలో మట్టి తవ్వకాలను చేపడుతూ అక్రమంగా అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. పలువురు తవ్వకాలను నిలిపివేయాలని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో ఏం చేస్తావో చేసుకో అంటూ అక్రమార్కుడు జవాబు ఇవ్వడం కోసం మెరుపు ఎంత ధైర్యంగా మట్టి తవ్వకాలు చేస్తూ అమ్మడం పట్ల అధికారుల అండదండలు ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మట్టి తవ్వకాల వెనకా కలెక్టరేట్ ఓ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తుంది.