- తెలంగాణ శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి
- కోటి దీపోత్సవంతో రాష్ట్రానికి మేలు
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- దీపం సర్వపాప హరణం: గణపతి సచ్చిదానంద స్వామి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): నాటి త్రిలింగ దేశమే నేటి తెలంగాణ రా ష్ట్రమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈప్రాంతంలో ఎక్కడ చూసినా శివాలయాలు, శై వక్షేత్రాలు దర్శనమిస్తుంటాయన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్‌లో ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు.
కోటి దీపోత్సవం ద్వారా భక్తులను, హిందువులందరినీ ఏకం చేస్తున్నారని అభినందించారు. కార్తీక మాసం రాగానే శివ భక్తులు మన రాష్ట్రం వైపు, హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమా న్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పన్నెండేళ్ల కిందట లక్ష దీపాలతో మొదలైన కార్యక్రమం.. కోటి దీపాలతో 13వ వసంతంలోకి అడుగుపెట్టడం గొప్ప విషయమన్నా రు.
కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా, ముక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీ పోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. అంతకు ముందు అరుణాచలేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు.
కోటి శివలింగాలను దర్శించుకున్న పుణ్యం
దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్యం, జ్ఞానం లభిస్తుందని మైసూర్ అవధూత గణపతి సచ్చి దానందస్వామి అన్నారు. ప్రజల కష్టసుఖా లు తెలిసిన సీఎంగా రేవంత్‌కు మంచి పేరున్నదన్నారు. కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే కోటి శివలింగాలను దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని, పాపాలు తొలగుతాయన్నారు.