- అనాథాశ్రమానికి నగదు, నిత్యావసరాలు అందజేత
- దాతృత్వం చాటుకున్న కుకునూర్‌పల్లి 1995-96 బ్యాచ్ టెన్త్ విద్యార్థులు
హైదరాబాద్ సిటిబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని సుధీర్ ఫౌండేషన్‌లో ఉంటూ చదువుకుంటున్న అనాథలకు అండగా నిలిచింది ఓ మిత్ర బృందం. సోషల్ మీడియా ద్వారా ఫౌండేషన్‌లో ఉంటున్న విద్యార్థుల బాధలను తెలుసుకున్న సిద్ధ్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ 1995-96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు తమవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
నగదుతోపాటు బియ్యం, పప్పులు, వంట నూనెను సమకూర్చుకొని ఆదివారం హయత్‌నగర్‌లోని సుధీర్ ఫౌండేషన్‌లో నిర్వాహకులకు అందజేశారు. ఫౌండేషన్‌లో ఉంటున్న 125 మంది విద్యార్థులతో మాట్లాడారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తమలా మరింతమంది సాయం చేసేలా చూస్తామని ఈ సేవా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు.