calender_icon.png 20 October, 2024 | 3:09 AM

మాకూ కావలెను గాలి మోటారు

20-10-2024 01:16:11 AM

‘మేము కూడా పోయి రావలె గాలి మోటారు’లో అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు కొందరు తెలంగాణ మంత్రులు అనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో హెలీక్యాప్టర్ల లొల్లి నడుస్తోంది. హైదరాబాద్ నుంచి సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాలకు,  పట్టణాలకు వెళ్లేందుకు కూడా మంత్రులు హెలిక్యాప్టర్లు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి వాడుతున్నప్పుడు తాము కూడా ఎందుకు వాడవద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమకు కూడా హెలిక్యాప్టర్లు కావాలంటూ అధికారులపై మంత్రులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైందని అంటున్నారు. అసలే అప్పుల పాలై నెలనెలా వడ్డీలు కూడా కట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న అమాత్యులు కాస్త ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.