కేరళలోని వయనాడ్ విలయానికి కకావికలమై ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వాడుకోవడంపై అధికార యంత్రాగం సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. బాధితుల జీపీఎస్, 218 మంది ఆచూకీ లభ్యం అయినట్లు నిపుణులు తెలిపారు. ఇలా డిజిటల్ అన్వేషణ చేస్తూ గల్లంతైన బాధితుల ఆసుపాసులను కనుక్కోవడం గతంలో2013లోనూ కేదార్నాథ్ వరదల సమయంలోనూ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.