రాజేంద్రనగర్, సెప్టెంబర్ 27: ఎగువన కురుస్తున్న వర్షాలకు గండిపేట జలాశయానికి వరద పోటు తగలడంతో గురువారం అధికారులు రెండు గేట్లు ఎత్తారు. శుక్రవారం వరద మరింత పెరగడంతో మరో రెండు గేట్లు ఒక ఫీటు మేర ఎత్తి 242 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇలా నాలుగు గేట్ల ద్వారా 484 క్యూ సెక్కుల నీరు కిందికి వెళ్తున్నది. మరోవైపు హిమాయత్‌సాగర్ జలాశయం ఒక గేటు ద్వారా 348 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఈ జలాశయానికి 500 క్యూసెక్కులు, గండిపేటకు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.