calender_icon.png 25 February, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల పుచ్చకాయ

23-02-2025 12:00:00 AM

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో 92శాతం నీరు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఇష్టంగా తింటుంటారు.  ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతాయి. పుచ్చకాయను వేసవిలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

పుచ్చకాయతినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. 

ఎక్కువగా ఆకలి అనిపించదు.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా  ఉన్నందున అనేక వ్యాధులను నివారిస్తుంది.

వ్యాయామం తర్వాత పుచ్చకాయ తింటే శరీరంలో వాపు తగ్గుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

వేసవిలో పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

వీటిలోని విటమన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. 

గట్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కూడా. 

ఇది బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.