calender_icon.png 27 April, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చెట్టుమీద గూడు కింద నీరు’

27-04-2025 12:00:00 AM

  1. మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కార్యక్రమం
  2. కొరటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

గుంటూరు, ఏప్రిల్ 26: వేసవిలో మూగ జీవుల దాహార్తి తీర్చేందుకు కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ నడుం బిగించిందని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. శనివారం కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెట్టుమీద గూడు కింద నీరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గోవులు, కోతులు, పక్షులు తదితర వాటికి తాగునీరు  అందించి రక్షించినప్పుడే సమాజం సంతోషంగా మనుగడ సాగించగలదని తెలిపారు. వాకింగ్ ట్రాక్ అధ్యక్షుడు కన్నసాని బాజీ మాట్లాడుతూ.. తాగునీరు లేక మూగజీవులు ప్రాణాలను విడిచిపెడుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని చేతనైన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవి జయరాజు, యోగా గురువులు సభాపతి ధర్మారెడ్డి, ట్రాక్ సెక్రెటరీ శివరామకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఇమడాబత్తిని కోటేశ్వరరావు, ఏళ్ల రత్తయ్య, వాకర్ సభ్యులు పాల్గొన్నారు.