calender_icon.png 4 April, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు షిఫ్టుల్లో వాటర్ ట్యాంకర్ల డెలివరీ

02-04-2025 12:00:00 AM

  1. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
  2. ట్యాంకర్ల పెండెన్సీపై సమీక్ష

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): వరుస సెలవుల నేపథ్యంలో జలమండలి పరిధిలోని పలు ప్రాంతాల్లో పెరిగిన వాటర్ ట్యాంకర్ల డిమాండ్‌ను తగ్గించేందుకు రెండు రోజుల పాటు అదనంగా రెండు షిఫ్టుల్లో ట్యాంకర్లను సరఫరా చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికా రులకు సూచించారు.

ఉగాది, రంజాన్ సెలవుల నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సెలవులపై వెళ్లడంతో పలు ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. వాటర్ ట్యాంకర్ల బుకింగ్, డెలివరీలపై మంగళవారం జలమండలి జీఎంలతో ఎండీ అశోక్‌రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ట్యాంకర్ బుకింగ్స్ పెద్దగా పెరగకపోయినప్పటికీ డ్రైవర్లు సెలవులపై వెళ్లడంతో షేక్‌పేట్, షాపూర్‌నగర్, షాపూర్‌నగర్2, బుద్వేల్, ఆసిఫ్‌నగర్, ఎన్టీఆర్ నగర్, భవానీ నగర్, చిలకలగూడ, మౌలా అలీ, గాజులరామారం, ఎర్రగడ్డ, గచ్చిబౌలి-2, వెంగళరావునగర్,  ఎల్లారెడ్డిగూడ, వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్‌లలో వందకు పైగా ట్యాంకర్ డెలివరీ పెండెన్సీ పెరిగిందన్నారు.

ఆయా ప్రాంతాలకు రెండు రోజులు అదనపు గంటలు పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పగటి వేళల్లో గృహ అవసరాలకు.. రాత్రి వేళ కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో జలమం డలి ఈడీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

కొండపాక పంపింగ్ స్టేషన్ పరిశీలన

నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో భాగమైన కొండపాక పంపింగ్ స్టేషన్‌ను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పంపింగ్, ఇతర అంశాలపై అంతరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముర్మూర్ వద్ద ఇన్‌లెట్ నుంచి నగరానికి సరఫరా, ట్రాన్స్‌మిషన్ తదితర వివరాలకు సంబంధించిన ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్(స్కాడా)ను వంద శాతం వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని ఆదేశించించారు. ఆయనవెంట ట్రాన్స్‌మిషన్ జీఎం రాజశేఖర్ ఉన్నారు.