calender_icon.png 27 February, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిగండం!

27-02-2025 02:00:55 AM

  1. వేసవికి ముందే అడుగంటుతున్న బోర్లు, బావులు 
  2. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటికి కటకట
  3. మున్ముందు పెరగనున్న సాగునీటి డిమాండ్ 
  4. ప్రాజెక్టుల్లో సగానికి తగ్గిన నీటి నిల్వలు
  5. వృథాకు అడ్డుకట్ట వేస్తేనే నీటి కష్టాలకు చెక్

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఎండలు ఇంకా ముదరక ముందే, నడివేసవి రాకముందే రాష్ట్రం లో తాగునీటి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి భారీగా వరదలు వచ్చి నా వాటిని మళ్లించి నిల్వ చేసుకునేందుకు సామర్థ్యం లేని దుస్థితి. దీంతో నదుల్లో నీటి కొరత నెలకొంది. తాగునీటి కోసం కొట్లాటలు తప్పేలా లేవం టూ సంకేతాలు కనపడుతున్నాయి.

హైదరాబాద్‌లో ఇప్పుడే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతా ల్లో మూడు రోజులకు ఓసారి కూడా తాగునీటి సరఫరా లేదు. చాలాచోట్ల బోర్లు అడుగంటిపోయాయి. ప్రజలు తాగునీటికి ట్యాంకర్లను ఆశ్రయించే పరిస్థితి వచ్చేసింది. తాగునీటికి ఇంతటి కష్టాలుంటే సాగునీటి పరిస్థితి ఇంకా దారు ణం. సీఎం ఇటీవల రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి స్థితిగతులపై సమీక్షించారు. 

ప్రాజెక్టుల్లో తగ్గిపోతున్న నీటినిల్వలు..

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నీటి సా మర్థ్యం మొత్తం 769.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో 395.18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో నీటి మట్టం వివరాలిలా  ఉన్నాయి. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.81 టీఎంసీలు,  గతేడాది ఇదే సమయాని కి నీటినిల్వ 4.618 టీఎంసీలు ఉంది.

శ్రీశై లం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 77.34 టీఎంసీలు, గతేడాది ఇదే సమయానికి 85.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది ఉంది. నాగార్జునసాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎం సీలు కాగా, ప్రస్తుతం 172.47 టీఎంసీలు, గతేడాది ఇదే సమయానికి 190.00 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35.54 టీఎంసీలు, గతేడాది ఇదే సమయానికి 40.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఎల్లంపల్లి పూర్తిసామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.69 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఇదే సమయంలో 15.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ త క్కువగానే ఉంది. రాష్ట్రానికి ప్రాణప్రదమైన శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో సగాని కంటే తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి. 

ఫిబ్రవరిలోనే దంచికొడుతున్న ఎండలు

ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే దంచుతుండటంతో మున్ముందు తాగు, సాగు నీటి కి డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు నెలలు జలాల పంపిణీ అంశం ప్రభుత్వానికి సవాల్‌గానే పరిణమించవచ్చు. జూరాల ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుని నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిపోయింది.  శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో భారీ గా నీటి నిల్వలు ఉంటున్నప్పటికీ, రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులు కావడంతో పాటు ఏపీ సామర్థ్యానికి మించి జలాలు వాడుతున్నది.

దీంతో తెలంగాణకు అన్యా యం జరుగుతున్నది. టెలిమెట్రీ పరికరాలు బిగిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టగా, ఏపీ అందుకు ససేమి రా అంటున్నది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద గండి కొట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఏపీ జలాలను తరలిస్తున్నది.

రానున్న మూడు నెలలూ కటకట..

ముఖ్యంగా కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై తెలంగాణ అధికారులు రాబోయే 3 నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ముందస్తుగా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలకు తగ్గట్లు నీటిని జాగ్రత్తగా వినియోగిస్తే తప్ప నీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.

రానున్న మూడు నెలలు అత్యంత కీల కం కానున్న నేపథ్యంలో రాష్ర్టమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగు నీరు, విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. దీంతో సాగు, తాగునీటి మధ్య అధికారులు సమతూకం పాటించాలి. ముందే నీటి ఎద్దడిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మంత్రి జూప ల్లి, ఎమ్మెల్యేలు కర్ణాటకకు వెళ్లి జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని వదలాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.