calender_icon.png 18 January, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చైర్మన్ ను సన్మానించిన వాటర్ సప్లై కార్మికులు

17-01-2025 11:27:47 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం ఈ నెలలో వారి పాలన పూర్తి అవుతున్న సందర్భంగా చైర్మన్ ధమ్మలపాటి వెంకటేశ్వరరావును  శుక్రవారం మున్సిపల్ ఫిల్టర్ బెడ్ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఇల్లందు మున్సిపాలిటీ ఫిల్టర్ బెడ్ లో చైర్మన్ ని, ఎండి ఫయాజ్, జి రాజేష్, దుర్గం మహేష్, భానోత్ రాంజీ, సంజీవ్, సదా, నందు చైర్మన్ కి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఈ ఐదు సంవత్సరాలు ఇల్లందు పాలకవర్గం మున్సిపాలిటీకి ఆస్తులు కూడా పెట్టారని ఈ ఆస్తుల వల్ల ఇల్లందు మున్సిపాలిటీ పై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీతాలు నెలనెలా అందేలాగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇతర బిల్డింగ్స్ కావచ్చు, ఇల్లందు పాలకవర్గం చరిత్రలో కార్మికులు బతికున్నంత కాలం ఈ పాలకవర్గ పిరియడ్ని మర్చిపోర న్నారు.

ఈ పాలకవర్గం పీరియడ్లో 12 వేల రూపాయల జీతం కానివ్వండి 15,600 జీతం కానివ్వండి 2011 నుండి 18 వరకు ఈఎస్ఐ పైసలు కార్మికులు తీసుకునే విధంగా సహకారం అందించారాని పాలకవర్గాన్నికొని యాడారు. అనంతరం  చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది అధికారుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది అన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీగా రాష్ట్రంలో దేశంలో గుర్తింపు వచ్చిందన్నారు. ఇల్లందులో నీటి ఎద్దడి లేకుండా రోజు విడిచి రోజు నీళ్లు ఇచ్చే లాగా సిబ్బంది, కార్మికులు పాలకవర్గం ఒక టీం వర్క్ గా పనిచేయడం వల్లనే, దేశంలో రాష్ట్రంలో గుర్తింపు పొందామని గుర్తు చేశారు. ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఇల్లందు పట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించారని జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో 22 వార్డు కౌన్సిలర్ అంకెపాక నవీన్, మున్సిపల్ ఏఈ శంకర్, కార్మికులు, నరసింహారావు కృష్ణ, కడారి వెంకటేష్, వీరన్న, గురునాథం, రవి, పప్పు ఉపేందర్, శ్యామ్, కొండ ప్రకాష్, భాస్కర్, టైలర్ రాజు తదితరులు పాల్గొన్నారు.