07-03-2025 01:29:16 AM
ప్రజాసంఘాల పోరాటాలకు స్పందించిన అధికారులు
వాంకిడి, మార్చి6 (విజయక్రాంతి): వాంకిడి మండలం చించోలి, కొలం గూడ గిరిజన గ్రామాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. బుధవారం గిరిజనులతో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.
గతంలో కలెక్టర్ తో పాటు పలువురు అధికారులు పర్యటనలు చేసి నీ అందిస్తామని చెప్పినప్పటికీ సమస్య తీరకపోవడంతో ఆందోళన బాట పట్టారు దీంతో స్పందించిన కలెక్టర్ 15 రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తాత్కాలికంగా వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రస్తుతం సంబంధిత అధికారులు నీటిని సరఫరా చేశారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టి ఏ జి ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు ఆగ్రామాలకు నీరు అందేలా చూడాలని కోరారు.