కరీంనగర్ సిటీ, డిసెంబర్22 (విజయక్రాంతి): భగత్ నగర్ మంచి నీటి రిజర్వాయర్ పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి రిజర్వాయర్ పరిధి లోని డివిజన్లకు యధావిధిగా త్రాగు నీరు సరఫరా చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మంచి నీటి సరఫరా విభాగం లో భాగంగా ఆదివారం రోజు నగరంలోని 33వ డివిజన్ భగత్ నగర్ మంచి నీటి రిజర్వాయర్‌ను సందర్శించారు. రిజర్వా యర్‌కు త్రాగు నీరు సరఫరా అయ్యే హె డిపీఏ పైపులైన్ పగిలిపోవడంతో సంబంధి త మరమ్మతు పనులను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.