20-02-2025 01:05:19 AM
కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): 24/7 పైలెట్ ప్రాజెక్టు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం నగరంలోని హౌజింగ్ బోర్డు, మారుతీనగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. 24/7 వాటర్ సప్లు లీకేజీలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ పాత పైపులైన్ ఉందో, అలాంటి ప్రదేశాల్లో లీకేజీలు తరచుగా ఏర్పడితే అలాంటి పైపులైన్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవికాలం దృష్ట్యా ఎక్కడ ఇబ్బంది లేకుండా, లీకేజీలను గుర్తిం చి వెంటనే అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రాజకుమార్, డీఈ ఓం ప్రకాశ్, వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్, స్మార్ట్ సిటీ పీఎం సి సందీప్ కుమార్, ఏజెన్సీ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.