06-03-2025 12:56:08 AM
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మునగాల, మార్చి 5: కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలోని పంట పొలాలకు ఎస్సారెస్పీ కాల్వకు నీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో గద్దెఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువునా ముంచిందన్నారు.
ఒకపక్క మూడు పర్యాయాలుగా రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎస్సారెస్పీ కాలువలో నీరు ఉన్న వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతులతో ఉద్యమిస్తామన్నారు.