calender_icon.png 7 February, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చెయ్యాలి

07-02-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు 

మోతే, ఫిబ్రవరి 6: ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతుల పంట పొలాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో నిర్వహించిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ పరిధిలో వేలాది ఎకరాలు వరి నాట్లు వేశారని అన్నారు. 

నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దీంత తక్షణమే ప్రభుత్వం ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.   సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కిన్నెర పోతయ్య, కాంపాటి శ్రీను, బూడిద లింగయ్య, నాగం మల్లయ్య, బానోతు లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, సోమ గాని మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.