calender_icon.png 19 March, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయాలి

19-03-2025 02:00:23 AM

 చేర్యాల, మార్చి18  తపస్పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కాగిత  రాజేందర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని చేర్యాల_ అయినా పూర్ రహదారిపై బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడినందువల్లనే సాగునీటి సమస్య తలెత్తింది అన్నారు. సాగునీరు అందక వేసిన వరి పంటలో సగానికి పైగా ఎండిపోయిందన్నారు. ఇప్పటికీ నీటిని విడుదలచేస్తే, కొంత మేరకైనా పంట చేతికొస్తుందని అన్నారు.

ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా నీరును చేయాలన్నారు.లేని పక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ రైతుకు అండగా నిలబడి నీరు వచ్చేవరకు పోరాటం చేస్తుందన్నారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిచేత ధర్నాను విరమింప చేశారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు ముత్యం నర్సింలు, గీస భిక్షపతి, మాజీ జెడ్పిటిసి సిద్ధప్ప, మాజీ ఎంపిటిసి మెరుగు కృష్ణ,నాయకులు తలారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

 బిఆర్‌ఎస్వి నాయకులు అరెస్ట్: ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు కోసం బి ఆర్ ఎస్ వి  అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునియ్యగా, చేర్యాల, కొమురవెల్లి లో బిఆర్‌ఎస్వి నాయకులను  ముందస్తుగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో బిఆర్‌ఎస్వి రాష్ట్ర నాయకులు జింకల పర్వతాలు, ఎరుపుల మహేష్, గజ్జ వెంకటేష్ తదితరులు ఉన్నారు.