calender_icon.png 22 February, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి కొరత రాకుండా చూడాలి

14-02-2025 12:43:47 AM

పిట్లం, ఫిబ్రవరి 13 : వేసవి కాలంలో నీటి కొరత రాకుండా చూడాలని మండల పంచాయతీ అధికారి రాము అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం  గ్రామపంచాయతీ కార్యాల యంలో గురువారం  మండల పంచాయతీ అధికారి ఎం. రాము ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామం లో ఇంటి పన్నుల వసూలు, వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాపై తగు సూచనలు చేశారు. నీటి ఎద్దడి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

గ్రామస్థులం దరూ సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.  ‘వేసవి కాలంలో నీటి కొరత ఎదురవుతుంది కాబట్టి, ప్రస్తుతం నుంచే అన్ని బోర్ వెలల్స్, నీటి వనరులను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేయాలని సిబ్బందిని సూచించారు.  గ్రామస్థులు కూడా నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వహించాలి,‘ అని వివరించారు.  పిట్లం గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాం, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు, కిష్టారెడ్డి, బసంత్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.