calender_icon.png 19 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదిరెడ్డిపల్లిలో నీళ్ల కష్టాలు

17-03-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్ మార్చి 16 (విజయక్రాంతి) తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలో నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత మూడు రోజుల నుంచి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీళ్లు రావడం లేదని ఆ కాలనివాసులు వాపోతున్నారు.

మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ నుంచి రోజుకు రెండు నుంచి మూడు బిందెలే వస్తున్నాయని మండిపడుతున్నారు. ఆ నీళ్లు సరి పోకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎండాకాలం ప్రారంభానికి ముందే నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నీళ్ల సమస్య లేకుండా చూడాలని కాలనివాసులు కోరుతున్నారు.