calender_icon.png 14 January, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరాల్లో నీటి కటకట

18-09-2024 12:00:00 AM

నేడు వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే :

ప్రపంచవ్యాప్తంగా కేప్‌టౌన్ నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికివాడలు తీవ్ర నీటి ఒత్తిడికి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకోవాలని జల నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి.

ప్రపంచ వనరుల సంస్థ (వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్) విడుదల చేసే ‘అక్వెడక్ట్ వా టర్ రిస్క్ అట్లాస్’ వివరాల ప్రకారం ప్రపంచంలోని నాలుగో వంతు జనాభా కలిగిన 17 దేశాలు  భారత్, పాకిస్థాన్, సౌదీ, తుర్కమెనిస్థాన్, ఖతార్, ఇజ్రాయిల్, లెబనాన్, ఇ రాన్, జోర్డాన్, లిబియా, కువైట్, ఇరిత్రియా, యూఏఈ, సాన్ మరీనో, బెహరేన్, ఓమన్, బోట్సానా) తీవ్ర నీటి ఒత్తిడికి గురి అవుతున్నాయని, అందులో మనదేశం 13వ ర్యాం కులో ఉందని తెలుస్తున్నది. ఈ 17 దేశాల్లోం చి 12 దేశాలు మధ్యప్రాచ్యం,ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. వీటితో పాటు మరో 44 దేశాలు కూడా నేడు నీటి ఎద్దడిని అనుభవిస్తున్నాయి. తీవ్ర నీటి కొ రత కలిగిన 17 దేశాల్లో 80 శాతం ఉపరితల, భూగర్భ జలాలు వ్యవసాయం, పరిశ్ర మలు, మున్సిపాలిటీల తాగు నీటి వినియోగానికే సరిపోతున్నది. నీటి ఎద్దడితో వా తావరణ ప్రతికూల మార్పులు ఏర్పడి కరు వు పరిస్థితులు విషమంగా మారుతాయి. 

భారతంలో నీటి ఎద్దడి

ఉత్తర భారతంలో ముఖ్యంగా చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడం, 2019లో చెన్నై నగరం రైళ్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నాలు చేయడం మనం ఇంకా మరువలేదు. 1990- - 2014 మధ్య ప్రతి ఏటా భూగర్భ జలాలు 8 సెంటీమీటర్లు లోతుల్లోకి వెళ్ళడం గమనించారు. 

ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, నాసిక్, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్ లాంటి అనేక భారత మహానగరాలు నేడు తీవ్ర నీటి కొరతతో సతమతం అవుతుండడం విదితమే. సూరత్, గ్వాలియర్, జబల్పూర్ లాంటి నగరాల్లో ’రెయిన్ వాటర్ హార్వెస్టింగ్’ వ్యవస్థ ఉండే గృహాలకు ఇంటి పన్నులో అధిక రాయితీ ఇస్తున్నారు. నీటి ఒత్తిడి సమస్య గంభీరతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘జల శక్తి మంత్రిత్వశాఖ’ను కూడా ఏర్పాటు చేయడం ముదావహం. దేశంలోని 17.87 కోట్ల గ్రామీణ గృహాల్లో 3.27కోట్ల గృహాలకు (18 శాతం) మాత్రమే సురక్షిత నల్లా నీరు లభిస్తున్నది. 

నీటి ఒత్తిడిని జయించే మార్గాలు

వర్షపు నీరు, ఉపరితల జలం, భూగర్భ జలాలను ప్రణాళికాబద్ధంగా పరిరక్షించుకుం టూ నీటి ఒత్తిడిని జయించే కృషి చేయాలి. నీటి పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన క ల్పించడం, జీవనశైలిని మార్చు కోవడం, నీ టిని మితంగా వాడటం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం,  ఆధునిక సాగు పద్ధతులను వాడ డం, వాటర్‌షెడ్ల నిర్మాణాలు చేపట్టడం, కొత్త విధానాలను అన్వేషించడం,  కాలుష్యాలను తగ్గించడం, జనాభా నియంత్రణ లాంటి చ ర్యలతో నీటి ఒత్తిడిని జయించే ప్రయత్నాలు చేయాలి. నీటి ఒత్తిడితో మానవ మనుగడ ప్రమాదంలోకి జారుకున్నప్పుడు నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశాలు రావచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి