calender_icon.png 10 January, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిఎద్దడి సమర్థంగా ఎదుర్కోవాలి

10-01-2025 12:18:41 AM

 జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్‌మిట్టల్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): ఈ వేసవిలో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్  అధికారులకు సూచించారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాల  సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వేసవిలో ఎక్కువ ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గతేడాది ట్యాంకర్ బుకింగ్, నీటిసరఫరా, డెలివరీ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరమైతే ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్ల సంఖ్య, నీటి మోతాదును పెంచుతామన్నారు. గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగదారులను సర్వే చేసి గుర్తించినట్లు చెప్పారు.

వారి ప్రాంగణాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భజలాలు పడిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అనంతరం వాటర్ ట్యాంకర్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈఎన్సీ, డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్ -2 స్వామి, సీజీఎంలు పాల్గొన్నారు.

జలమండలిలో ఉద్యోగం రావడం అదృష్టం

గ్రేటర్‌లోని 1.3 కోట్ల మందికి తాగునీటి సరఫరా, మురుగు నిర్వహణ సేవలందిస్తున్న జలమండలిలో ఉద్యోగం రావడం అదృష్టమని ఎండీ అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జలమండలి పీఅండ్‌ఏ, ఎఫ్‌అండ్‌ఏలో గ్రూప్-4ద్వారా నియమితులైన జూనియర్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఈస్కి క్యాంపస్‌లో జరిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగులను ఉద్ధేశించి మాట్లాడారు.