29-03-2025 09:09:46 PM
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య..
ఎల్బీనగర్: ప్రజలు జల వనరుల సంరక్షణకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ జోనల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య పిలుపునిచ్చారు. ప్రపంచం నీటి దినోత్సవం పురస్కరించుకొని నాగోల్ డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీ (విశాలాంధ్ర కాలనీ) లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ నీటి దినోత్సవ లక్ష్యాలు, ‘హిమానీనదం సంరక్షణ’ తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమ, స్వచ్ఛమైన శక్తి ఉత్పత్తి, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలపై అవగాహన కల్పించారు.
వేగంగా కరిగే హిమానీనదాలు నీటి ప్రవాహాలకు అనిశ్చితికి కారణమవుతున్నాయని తెలిపారు. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హిమానీనదాలకు అనుగుణంగా స్థానికంగా జల వనరుల సంరక్షణ వ్యూహాలు అవసరమని తెలిపారు. ప్రజలు నీటి వృథాను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్, రాక్ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, రాక్ హిల్స్ కాలనీ, సాయిభవాని కాలనీ అధ్యక్షుడు యాదయ్య, సీడ్ ఎన్జీవో ప్రతినిధి నాగ బ్రహ్మచారి, శ్రీనివాస కాలనీ, విశాలాంధ్ర కాలనీ, రాక్ టౌన్, వెంకట రమణ కాలనీ వాసులు పాల్గొన్నారు.