calender_icon.png 23 March, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వనరులను కాపాడుకోవాలి

22-03-2025 06:16:30 PM

- వనస్థలిపురం సీఐ శ్రీనివాస్.. 

- వేంకటేశ్వర కాలనీలో చలివేంద్రం ప్రారంభం.. 

ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం వనస్థలిపురం లోని వేంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలతో జల వనరులను పొదుపుగా వాడుకుంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు భావనా శ్రీనివాస్(జాగృతి ఎన్జీవో చైర్మన్), కృష్ణ(శ్రీవేంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు), యాదగిరి రావు(విప్ర సేవా సమితి అధ్యక్షుడు), వంశీకృష్ణ(టెక్కీ రైడ్ సభ్యులు), సురేందర్, లక్ష్మీ శ్రీ (సంతోషి మాతా ఆలయ చైర్ పర్సన్), ఎస్సై రవినాయక్, సామాజిక కార్యకర్త విజయ్, దాతలు మనోహర్, గడ్డం లలితాంబ, భారతి, రఘునాథ్ యాదవ్, రవి కుమార్, శేఖర్, భద్రారెడ్డి, క్రిష్ణ, సురేశ్, రమేశ్ రెడ్డి, మధు, సుధాకర్, ఊ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, జాగృతి ఎన్జీవో వలంటీర్లు పాల్గొన్నారు.