calender_icon.png 26 December, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ కుడి కాల్వకు నీటి విడుదల

22-12-2024 01:56:18 AM

నల్లగొండ, డిసెంబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ది రైతు ప్రభుత్వమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వ ఆయకట్టుకు శనివారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. మూసీ ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకునేందుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.