calender_icon.png 9 January, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగభద్ర నుంచి నీటి విడుదల

09-01-2025 12:53:50 AM

గద్వాల, జనవరి 8 ( విజయక్రాంతి ): అలంపూర్ నియోజకవర్గంలోని రైతులు ఆర్డీ ఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు చేస్తున్న రెండవ పంట(తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో) ఎండిపో తున్నాయి. దీంతో రైతులు ఎమ్మెల్యే విజ యుడు,  ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ల దృష్టికి రైతులు తీసుకురావడం జరిగింది.

స్పందించిన వారు  తుంగభద్ర డ్యాం అధికారులతో, ఆర్డీఎస్ అధికారులతో మా ట్లాడి ఆర్డీఎస్ రెండో ఇండెంట్ లో భాగంగా 1టిఎంసి నీటిని విడుదల చేయాలని ఎపి అధికారులను వారు ఫోన్ ద్వారా అధికా రులను కోరారు. స్పందించిన  ఆంధ్రప్రదేశ్ అధికారులు తుంగభద్ర డ్యాం నుండి బుధ వారం నీటిని విడుదల చేశారు. మరో మూ డు రోజుల్లో ఆర్డీఎస్,తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వరకు సాగునీరు వచ్చే అవకాశం ఉన్నదనీ వారు పేర్కొన్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లకు అలంపూర్ నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.