నిజామాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మడి గ్రామ శివారులోని అర్హులు రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి యాసంగి పంట సాగుకై 135 క్యూసెక్కుల నీటిని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. రైతులు నీటిని పొదుపుగా వాడాలని, కాలువ పరివాహక రైతులు ఎటువంటి విబేధాలు లేకుండా పరస్పర అవగాహనతో పంటలు సాగు చేసుకోవాలని రాకేశ్‌రెడ్డి సూచించారు.