calender_icon.png 25 October, 2024 | 5:58 AM

నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి

02-09-2024 12:52:34 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్1 (విజయక్రాంతి): నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, సీవరేజీ ఓవర్‌ఫ్లో అవుతున్న మ్యాన్‌హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు రోజులు గా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి ఉన్న తాధికారులు, జీఎంలు, డీ.ఈఎంలు, మేనేజర్లతో  ఆదివారం ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించా లని  సూచించారు. ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్‌హోళ్లను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి  ఫోన్ చేయాలని సూచించారు.