కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని అప్పేపల్లి ఎంపీపీఎస్ పాఠశాలకు బద్రి సాయి వాటర్ ప్యూరిఫైయర్(Water Purifier) విరాళంగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాథోడ్ సుభాష్(MEO Rathod Subhash) మాట్లాడుతూ... గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు శుద్ధ నీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి స్థానికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సదాశివ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, బసవయ్య తదితరులు ఉన్నారు.