31-03-2025 10:28:55 PM
రూ.5 లక్షలతో ఏర్పాటు చేయించిన సుభాష్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): తాగునీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేయించాలని కోరిన గ్రామస్తులకు వెంటనే సుభాష్ రెడ్డి స్పందించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ పరిధిలోని శివారు రామ్ రెడ్డి పల్లి గ్రామస్తుల కోరిక మేరకు ఐదు లక్షలతో నీటి శుద్ధి యంత్ర ప్లాంటును ఏర్పాటు చేశారు. ఎస్సార్ ఫౌండేషన్ నేత ప్రభుత్వ పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సోమవారం రామ్ రెడ్డి పల్లి లో నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి పల్లి గ్రామస్తులు, ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అశోక్ గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.