calender_icon.png 30 November, 2024 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వట్టెం పంపుహౌజ్‌లో నీటి తోడివేత పూర్తి

27-09-2024 01:14:49 AM

అదనపు విద్యుత్ పనులకు రూ.62 కోట్లు  మంజూరు

వెల్లడించిన ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): పాలమూరు ప్రాజెక్టు 3వ లిఫ్టు వట్టెం రిజర్వాయర్‌లోని వరదనీటి తోడివేత పూర్తి అయ్యిందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి తెలిపారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర వద్ద ఉన్న పంపుహౌజ్‌ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో ఇంజినీర్లు 30 ఫీట్లకుపైగా ఉన్న వరద నీటిని బయటికి తోడివేశారని, మరో 15 రోజుల్లో డ్రై , వెట్న్ కోసం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. సొరంగమార్గంలో వరదనీటి వల్ల ఎలాంటి నష్టం వాటిళ్లలేదని ఇంజినీర్లు తెలిపారని పేర్కొన్నారు. పంప్‌హౌజ్ రన్నింగ్‌కు కావాల్సిన విద్యుత్ పనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.62 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు.