calender_icon.png 19 March, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి కష్టాలు తలెత్తకుండా చూడాలి..

18-03-2025 05:45:16 PM

ప్రత్యేక అధికారి చందర్ నాయక్.. 

జుక్కల్ (విజయక్రాంతి): నీటి కష్టాలు తలెత్తకుండా చూడాలని జుక్కల్ మండలం ప్రత్యేక అధికారి కామారెడ్డి జిల్లా జెడ్పి సీఈవో చందర్ నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవికాలం ఉన్నందున నీటి ఎద్దడి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని తనకు చేరవేయాలని సూచించారు. ప్రతి గ్రామ కార్యదర్శి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

దీంతో పాటు అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కూలీలకు అధిక సంఖ్యలో వచ్చి చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల గురించి మండల స్థాయి అధికారులు గ్రామాల్లోని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా పాలనకు సంబంధించిన పథకాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రాజు వికాస పథకం గురించి అవగాహన కల్పించి పథకాలు అర్హులకు అందేటట్లు చూడాలన్నారు. సంబంధిత అధికారులు విధులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఎపిఓ తులసి రామ్, కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.