calender_icon.png 26 March, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమే జగతికి మూలం

23-03-2025 12:35:59 AM

గుంటూరు జిల్లా న్యాయమూర్తులు  

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): గ్లేసియర్లను పరిరక్షించుకోవడం ద్వారా  నీటి వనరుల భవిష్యత్తును రేపటి తరాలకు అందించవచ్చునని గుంటూరు జిల్లా న్యాయమూర్తులు వైవిఎస్‌బిజి పార్థసారథి, సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. శనివారం ఆంధ్రప్రదేశ్  కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన వరల్డ్ వాటర్ డేలో వారు మాట్లాడారు.

గ్లేసియర్లను కాపాడుకోవాలంటే, ముందుగా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించాలన్నారు.   ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎండి నజీనా బేగం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా కాపాడాలన్నారు. అనంతరం విద్యార్థులకు నీటి గొప్పతనాన్ని వివరించి పోటీలు నిర్వహించారు.