calender_icon.png 23 March, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం

22-03-2025 06:41:07 PM

ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి..

ఎంపిడిఓ రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): సమస్త జీవకోటికి నీరే ప్రాణదారం అని ప్రతి ఒక్కరు నీటిని సంరక్షిస్తూ పొదుపుగా వాడుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ కోరారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నీటిని వృధా చేయకుండా పొదుపు పాటించాలని కోరారు .వర్షం నీటిని వృదా పోకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలమట్టాన్ని పెంపొందించాలన్నారు. 

మండల వ్యవసాయ అధికారి జి.కిరణ్మయి మట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధికంగా నీటి పొదుపు పద్దతులను పాటిస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న దేశంగా ఇజ్రాయిల్ ఉందని రైతులందరు ఇజ్రాయిల్ ను ఆదర్శంగా తీసుకుని సూక్ష్మ నీటి పారుదల పద్దతులైనటు వంటి డ్రిప్, తుంపర్ల సేద్య పరికరాలు విరివిగా వినియోగించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడుతూ.. వేసవిలో లోతు దుక్కులు దున్నుట, వాలుకి అడ్డంగా దున్నుట, పొలం గట్లపై లైవ్ ఫెన్సింగ్, ఆరు తడి పంటల సాగు తదితర పద్ధతుల ద్వారా నీటిని సంరక్షించుకొనే విదానాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు.

భూగర్భజల శాస్త్రవేత్త గణేష్ మాట్లాడుతూ... అధిక భూతాపం కారణంగా భూమి వేడెక్కి మంచు కొండలు, హిమనినధాలు కరిగి సముద్ర మట్టం పెరుగుతుందని తద్వారా వరదలు సంభవించే అవకాశాలున్నాయని శ్రేష్ట మైన, సరైన నీటి పొదుపు పద్దతులను పాటించి భూమిని కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ భూగర్భ భౌతిక శాస్త్రవేత్త దివ్య, వ్యవసాయ విస్తరణ అధికారి కనకరాజు, పంచాయతి రాజ్ ఏఈ ఇసాక్ మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య, సిద్ధం జనార్దన్, పెరుమాండ్ల వెంకటేశ్, దైనేని రాజ్ కుమార్, మండల రైతులు పాల్గొన్నారు.