calender_icon.png 23 October, 2024 | 8:49 AM

నీరు కరువాయే.. సాగు బరువాయే!

07-10-2024 12:00:00 AM

  1. మురిపించి ముఖం చాటేసిన వరుణుడు 
  2. ఎండుతున్న పంటలు, ఆందోళనలో రైతులు

మణుగూరు, అక్టోబర్ 6: వర్షం జాడలేక, ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా కిన్నెరసాని ఎడమ కాలువ కింద వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. నీరు లేక పంట పొలాలు బీటలు వారడంతో ఇంజన్ల ద్వారా నీరు అం దిస్తూ పంటను కాపాడుకోవటానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

నాట్లు వేశామని ఆన ందపడిన రైతులు సాగునీరు లేక ఎండుతున్న పంటలను చూసి బావురుమంటున్నా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసా ని ఎడమ కాలువ కింద వందల ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు సాగు చేశారు. కిన్నెరసాని కాలువలో నీటిసరఫరా నిలిచిపోవడంతో ఏ మేరకు పంట చేతికొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కళ్లముందే ఎండుతున్న పంటలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఒడ్డుగూడెం, ఉప్పుసాక, పినపాక పట్టి నగర్, అంజనాపురం, జింకలగూడెం, వేపలగడ్డ ప్రాంతాల్లో సుమారు వందల ఎకరాల్లో వరి, మిరప, పత్తి సాగవుతుంది. వరి సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కళ్లముందే బీటలువారి ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కాలువలో ఉన్న అరకొర నీటిని ఆయిల్ ఇంజన్లతో తోడి పంటలను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని తోడటానికి రోజుకు ఆయిల్, ఇంజను అద్దె కలిపి రూ.2 వేల ఖర్చవుతుందని వాపోతున్నారు. జనవరి వరకు సాగునీరు అందితేనే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉంది. లేదంటే పెట్టుబడులు బూడిదలో పోయిన పన్నీరే అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.