calender_icon.png 21 September, 2024 | 10:56 PM

హైడల్ విద్యుత్ ప్రాజెక్టులోకి నీళ్లు

21-09-2024 01:15:48 AM

వరదతో పాడైన యంత్రాలు

రూ.50 లక్షలకు పైగా నష్టం 

మరమ్మతులకు ఆరు నెలల సమయం

ఖమ్మం(విజయక్రాంతి)/కూసుమంచి, సెప్టెంబర్ 20: ఇటీవల ఖమ్మం జిల్లాను ముంచెత్తిన వరదల్లో పాలేరు విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్టు కూడా నీటి పాలైంది. ఏటా వానాకాలంలో రెండు, మూడు నెలల పాటు పనిచేసే ఈ హైడల్ ప్రాజెక్టు ఇటీవల వచ్చిన వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రాజెక్టులోని యంత్రాల్లోకి వరద నీరు పోవడంతో పాడై, పని చేయడంలేదు. దీంతో రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వరద తగ్గిన తర్వాత యంత్రాల మరమ్మతుకు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ అధికారులను రప్పించారు. మరమ్మతులు పూర్తి అయ్యేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 

1993లో ఏర్పాటు

రెండు మెగావాట్ల విద్యుత్ సామర్థం ఉన్న ఈ హైడల్  ప్రాజెక్టును 1993లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పని చేయాలంటే పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులు ఉం డాలి. ప్రతి సంవత్సరం జూలై రెండవ వార ంలో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. నీటి లభ్యత ఆధారంగా దీనిలో వి ద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. గత సంవత్స రం రిజర్వాయర్‌లో నీటి మట్టం లేని కారణ ంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి చేద్దామని అధికారులు భా వించినా భారీ వరదలు అందుకు అడ్డుకట్ట వేశాయి. ఇక్కడ ఎస్‌ఈ స్థాయి అధికారితో పాటు ఏడీ, ఇద్దరు ఏఈలు, 15 మంది ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. పూర్థిస్థాయిలో సిబ్బంది ఉన్నా కాలం కలిసి రావడం లేదు.