calender_icon.png 17 November, 2024 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతిలోని నీళ్ళు

09-11-2024 12:00:00 AM

అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు మర్నాడు నూతిలోంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే జమీందారు ఆపేశాడు. “నేను నీకు నుయ్యి అమ్మాను కానీ అందులోని నీళ్ళు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన రొక్కం చెల్లించి నీళ్ళు తోడుకో!” అన్నాడు. 

రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమీందారుకి, రైతుకి గొడవ మొదలైంది. మధ్యవర్తిగా బీర్బాల్‌ని సమాధానం చెప్పమన్నారు. 

బీర్బల్ కొంచెం సేపు ఆలోచించి.. జమీందారుతో ఇలా అన్నాడు.. “సరే నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాం. కానీ అలా అయితే నీకు నూతిలో నీళ్ళు పెట్టుకునే అర్హత లేదు. ఆ నీళ్ళన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చుకో లేదా రైతుకి నువ్వే నూతిలో నీళ్ళు పెట్టుకుంటున్నందుకు అద్దె ఇవ్వాలి.” అని బీర్బల్ తీర్మానం చేశాడు. 

బీర్బల్ తెలివి తేటల మూలంగా తన దగా విఫలం అయ్యిందని జమీందారుకి అర్థం అయ్యింది. గొడవ మానేసి నూతిలోని నీళ్ళు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు.  

- వర్డ్‌ప్రెస్.కాం సౌజన్యంతో