calender_icon.png 31 October, 2024 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలంలో జల సవ్వడి

31-07-2024 03:14:31 AM

  1. 10 గేట్లు ఎత్తిన అధికారులు 
  2. దిగువకు కృష్ణమ్మ పరుగులు

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, జులై 30 (విజయక్రాంతి): శ్రైశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా.. జూరాల, సుంకేసుల నుంచి 4,13,178 క్యూసెక్యుల నీరు వచ్చి శ్రైశైలం ప్రాజెక్టులో చేరుతున్నది. తుంగభద్రతో కలి పి శ్రీశైలంకు భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో 10 గే ట్లు 10 మీటర్ల మేర ఎత్తి 2,75,700  క్యూసెక్కులను దిగువనకు వదులుతున్నారు. దీం తో కృష్ణానదిపై ప్రాజెక్టుల్లో జలకళ కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా వెళ్తున్న వరదను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు

ఎగువ గోదావరి వెలవెల...

గోదావరి ప్రాజెక్టులకు ఎగువన వరద లేక వెలవెలపోతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నేటికీ వరద ఆశాజనకంగా లేదు. 90.30 టీఎంసీల నీటి మట్టం ఉన్న ప్రాజెక్టులో 35.78 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 12వేలకు పైబడి వస్తోంది. మరోవైపు దిగువన మేడిగడ్డ నుం చి భద్రాచలం వరకు మాత్రం 8 నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతోంది. అయితే ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసే అవకాశం లేక మేడిగడ్డ, సమ్మక్క సాగర్, దుమ్ముగూడెం వద్ద  వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువనకు వదులుతున్నారు. 

కాళేశ్వరంలో గోదావరి ఉగ్రరూపం

జయశంకర్ భూపాలపల్లి(విజయక్రాం తి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగ మం వద్ద గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద మంగ ళవారం 10.750మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ బరాజ్‌కు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం వరకు 7.71 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 85 గేట్ల ద్వారా అదే స్థాయిలో దిగువకు వదిలారు.

కొనసాగుతున్న ఎత్తిపోతలు

కరీంనగర్ (విజయక్రాంతి): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటిని నందిమేడారానికి 15,750 క్యూసెక్కులు వదులుతున్నారు. అక్కడి నుంచి ఐదు పంపుల ద్వారా ఎత్తిపోసి రామడుగు మండలం గాయత్రి పంపుహౌజ్‌కు 15,750 క్యూసెక్కులు వదులుతున్నారు. గాయత్రి పంపుహౌజ్ నుంచి మిడ్ మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మిడ్ మానేరు సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రం నాటికి 9.1 టీఎంసీలకు చేరుకుంది. 

శ్రీశైలం ప్రాజెక్టులో తప్పిన ప్రమాదం

నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): శ్రీశైలం ప్రాజెక్టు పాతాలగంగలో ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్‌కు చెందిన కృష్ణ, ఈశ్వర్, సిద్ధి, గురుచరణ్‌గౌడ్, రమేష్ మంగళవారం పాతాల గంగలో స్నానం చేసేందుకు కారులో వెళ్లారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అధికారులు నాల్గో గేట్ ఎత్తడంతో వరద ఉధృతి పెరిగి, కారు చిక్కుకుంది. స్థానికులు గమనించి వెంటనే కారుతో పాటు కాపాడారు.