- రైతులు నీటిని పోదుపుగా వాడుకోవాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్, డిసెంబర్ 31: లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలు వ ద్వారా చివరి ఆయకట్టు దిగువకు నీటిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మా పూర్ మండలం ఎల్‌ఎండి ప్రధాన కాకతీ య కాలువ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని కొనసాగించనున్నట్లు తెలిపారు ప్రస్తు తం నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలకు గాను 22.819 టీఎంసీల నీటిమట్టం ఉంద న్నారు.
4000 క్యూసెక్కుల నీటిని మొదటి వారం జోన్-2 సూర్యాపేట వరకు, ఎల్‌ఎండీ నుండి మహబూబాబాద్ జోన్-1 వరకు మరోవారం రోజుల చొప్పున విడుదల చేయనున్నట్లు చెప్పారు. వార బంది ప్రకా రం ఏడు లక్షల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.స్టేజ్ వన్‌కి 8రోజుల, స్టేజ్ 2 కి 7రోజులు, స్టేజ్ 2 కి మొదటి దఫా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నీటిని దిగువ ప్రాంతంలో రైతులు వేసుకున్న వంటలకు 2025 మార్చ్ 31 వరకు మాత్రమే నీటిని విడుదల చేస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరి గేషన్ ఎస్సి పెద్ది రమేష్, ఈఈ నాగ భూషణం, ఏఈలు వంశీకృష్ణ, కిరణ్ కుమా ర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.