30-04-2025 12:03:35 AM
మాజీ మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావు...
హైదరాబాద్ (విజయక్రాంతి): సాగునీటి నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు వర్ధంతి సందర్భంగా మంగళవారం మాజీమంత్రులు కేటీఆర్(KTR), హరీశ్‌రావు(BRS MLA Harish Rao) తమ ఎక్స్ ఖాతాల్లో నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల దోపిడీని ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించిన మేథావి ఆర్ విద్యాసాగర్‌రావు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ జన హృదయాల్లో జలవిజ్ఞాన నిధిగా, నీళ్ల సారుగా మిగిలారన్నారు. నీటి రంగ నిపుణుడు, నీళ్లు నిజాలుతో తెలంగాణను జాగృతం చేసిన మహానీయుడు, సమైక్య పాలకుల జలదోపిడీని చివరి శ్వాసవరకు అడ్డుకున్న వ్యక్తి విద్యాసాగర్‌రావు అని హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.