calender_icon.png 28 September, 2024 | 4:54 AM

46 మంది జలసమాధి

27-09-2024 12:45:24 AM

మృతుల్లో 37 మంది చిన్నారులే

పాట్నా, సెప్టెంబర్ 26: ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలని ఉవిళ్లూరిన వారి కుటుంబాల్లో ఆ పండుగే విషాదం నింపింది. పవిత్ర సాన్నం ఆచరిస్తే పాపాలు పోతాయని ఆశపడ్డ వారి ప్రాణాలే పోయాయి. బీహార్‌లో జీవిత్ పుత్రిక ఉత్సవం సందర్భంగా గురువారం తీవ్ర విషా దం నెలకొన్నది. 15 జిల్లల్లో వివిధ న దుల్లో పండుగపూట పవిత్ర స్నానాలు చేసేందుకు నదుల్లోకి దిగిన 46 మంది ప్రజలు తిరిగి బయటకు రాలేదు. వారంతా నదుల్లో నీటి ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. మృతుల్లో అత్యధికంగా 37 మంది చిన్నారులే ఉండటం మరింత విషాదకరం.

43 మంది మృతదేహాలను వెలికితీసినట్టు బీహార్ విపత్తు నిర్వహణ విభాగం (డీఎండీ) అధికారులు వెల్లడించారు. తూ ర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్స ర్, సివాన్, రోహ్‌తస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తీపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.