calender_icon.png 10 March, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌రూబాను మీ ఎక్స్‌తో చూడండి

08-03-2025 12:00:00 AM

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెం ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ మాట్లాడుతూ.. “బ్రేకప్ అయితే లవర్‌ను శత్రువులా చూస్తాం. కానీ మా సినిమా చూశాక మీ అభిప్రాయం మారుతుంది.

ప్రతి ఒక్కరి జీవితాల్లో మాజీ ప్రేయసి ఉంటుంది. మీకు వీలైతే ఈ సినిమాను మీ ఎక్స్ లవర్‌తో చూడండి. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఫీలింగ్‌తో వస్తారు’ అన్నారు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. “దిల్‌రూబా’లో అంజలి క్యారెక్టర్‌లో మిమ్మల్ని ఆకట్టుకుంటా. ఈ సినిమా చూసే అమ్మాయిలు అంజలితో, అబ్బాయిలు సిద్ధుతో పోల్చుకుం టారు. హీరో కిరణ్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను” అన్నారు.

మరో కథానాయకి క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ.. “దిల్ రూబా’ సినిమాలో మ్యాగీ అనే క్యారెక్టర్‌లో నటించాను. మూవీలో సిద్ధు, మ్యాగీ లవ్ మీకు హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది” అన్నారు. డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రేమ గొప్పది కాదు..

దాన్ని పంచే వ్యక్తి గొప్పవాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించాను’ అన్నారు. నిర్మాత రవి మాట్లాడు తూ.. “దిల్‌రూబా’ కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, డీవోపీ డానియేల్ విశ్వాస్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.