- కాంగ్రెస్ శ్రేణులకు దిగ్విజయ్ సూచన
జబల్‌పూర్, జూలై 16: నిత్యం ఆరెస్సెస్, బీజేపీపై విమర్శలు గుప్పించే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్.. సెటైరికల్‌గానైనా సంఘ్‌ను మెచ్చుకొన్నారు. మధ్యప్రదేశ్‌లో నర్సింగ్ కుంభకోణంపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం జబల్‌పూర్‌లో నిరసన తెలిపారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఆరెస్సెస్ మనకు ప్రత్యర్థి అయినా ఆ సంస్థను చూసి నేర్చుకోండి. అది మైండ్ గేమ్ ఆడుతుంది. వాళ్లు ఎక్కడా నిరసన ప్రదర్శనలు చేయరు. ధర్నాలు చేయరు. పోలీసులతో తన్నులు తినరు. జైళ్లకు వెళ్లరు. ఇతరులను జైళ్లకు పంపుతారు. క్షేత్రస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేసుకోకుండా నిరసన ప్రదర్శనలు చేయటంలో ఉపయోగం ఉండదు’ అని పేర్కొన్నారు.