- చికెన్ వేస్టేజ్‌కి ఎందుకు అంత డిమాండ్
ఎక్కడ పారేయాలో అర్థం కాని స్థాయి నుంచి కొనుగోలు దొరకని స్థాయికి ఎదిగిన చికెన్ వ్యర్థ్ధాలు
మూడు నెలలపాటు వ్యర్థాలు సేకరించినందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన మున్సిపల్ అధికారులు
చికెన్ వేస్టేజీ సేకరించి ఉపయోగించడంలో నిబంధనలను పాటించడం లేదని తీవ్ర ఆరోపణలు
మహబూబ్ నగర్, జనవరి 5 (విజయ క్రాంతి): చికెన్ వేస్టేజ్ పంచాయతీ పాలమూరు మున్సిపాలిటీలో తీర చర్చిని యాశం అయింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత కొంతకాలంగా చికెన్ వేస్టేజ్ పంచాయతీ కొనసాగుతుంది. ఇటీవ ల మున్సిపల్ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని, చేపల పెంపకంలో ముఖ్య పాత్ర చికెన్ వేస్టేజ్ ని ఉపయోగిస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆరోపణలకు ముగింపు పెట్ట డంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆదాయం ఓకే వేస్టేజ్ ఉపయోగం ఎక్కడ
మున్సిపల్ శాఖకు చికెన్ వేస్టేజ్ రూపంలో మూడు నెలల కాలం చికెన్ వేస్ట్ చేసిన తీసుకువెళ్లేందుకుగాను గత నెల 28వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించారు. ఈ బహిరంగ టెండర్‌లో రూ 14 లక్షల 20వేలకు మూడు నెలలపాటు ఈ వ్యక్తులను తీసుకుపోయేం దుకు అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది.
శాస్త్రీయ పద్ధతిలో చికెన్, మటన్ వ్యక్తలను ఉపయోగించాలని మున్సిపల్ శా ఖ చెబుతుంది. కాగా చెరువులలో చికెన్ వేస్టే జీ పడేసి చేపలను పెంపకం చేస్తున్నారని తక్కువ సమయంలో అత్యధికంగా బరువు తో చేపలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ చేపలను తిన డం ద్వారా క్యాన్సర్ తో పాటు మనుషులకు వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉందని బహిరంగంగానే పలువురు ప్రముఖులు చర్చించుకుంటుండ్రు.
వినియోగం ఒకలా.. నిబంధనలు మరోలా
చికెన్ వ్యర్థాలను ఎండబెట్టి బాల్స్ తయా రు చేసే రిజిస్ట్రేషన్ అయిన; కంపెనీ కి ఈ వ్యర్ధాలను తరలించే; వారికి ఈ కాంట్రాక్టు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కొం దరు వ్యాపారస్తులు; ఈ కంపెనీల తో డబ్బు లు ఇచ్చి నామమాత్రపు లెటర్‌లు తెచ్చుకొని ఇక్కడ వ్యర్ధాలను తరలించే కాంట్రాక్ట్ పొందు తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కానీ చికెన్ వ్యర్ధాలు మాత్రం రిజిస్టర్ లైసెన్స్ ఉన్న కంపెనీకి కాకుండా నేరుగా చేపల చెరు వుల యాజమాన్యాలతో నెలకు ఇంత అని మాట్లాడుకొని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తిస్తూ పలువురికి క్యాన్సర్ అంటగట్టేందుకు పరోక్షంగా కారణం అవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. గతంలో చికెన్ సెంటర్ ల నుండి వ్యర్ధాలను మున్సిపాలిటీ వాహనాలలో తీసుకెళ్లి డంపింగ్ యార్డ్‌లో పడేసే రోజులకు కాలం చెల్లింది.
చేపల పెంపక వ్యాపారులకు ఎవరు చెప్పారు ఏమో తెలియదు కానీ చికెన్ వేస్టేజీ ఉపయో గించడం ద్వారా చేపలు పుష్కలంగా తక్కువ సమయంలో అత్యధికంగా లాభం వస్తుంద ని ఎవరు చెప్పారో తెలియదు కానీ చికెన్ వేస్టేజ్ కి తెగ డిమాండ్ ఏర్పడింది. క్యాట్ ఫిష్ వ్యాపారస్తులు ఈ చికెన్ వ్యర్ధాల కోసం చికెన్ షాప్‌లో వెంట నెలకు ఇంత ముట్టజె ప్పుతాం మాకే వేస్టేజ్ ఇవ్వాలని ఇప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు చికెన్ సెంటర్‌ల ముందు తిరుగుతున్నారని పలువురు ఆరోపిస్తుండ్రు.
బహిరంగ ప్రకటన చేస్తే తప్పేముంది
చికెన్, మటన్ వేత్తలను తరలించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మున్సి పల్ శాఖ బహిరంగంగా పట్టణ చేస్తే తప్పే ముందని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణులకు ముప్పు వాటిల్ల ఆరోపణ లు వస్తుంటే మున్సిపల్ అధికారులు మా త్రం మౌనంగా ఉండడం ఏంటని, వీటిలో ఏది నిజం ఏది అబద్దం అనే సందేహంతో కొంతమంది ప్రజలు చేపల వైపు చూసేందు కు సందేహం వ్యక్తం చేస్తుండ్రు.
స్పందించ వలసిన అధికారులు మాత్రం శాస్త్రీయ పద్ధ తిలో వ్యర్థాలను తరలిస్తున్నట్లు కేవలం కాగితాలకే పరిమితం చేస్తుండ్రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చికెన్ విడతల తర లింపు ఎంతవరకు పారదర్శకంగా జరుగు తుందని విషయాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిస్థాయిలో ప్రజలకు తెలుపాల్సినా అవసరం ఎంతైనా ఉంది.
శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధాలను ఉపయోగించాలి
చికెన్, మటన్ వ్యర్థాలను టెండర్ ద్వా రా తీసుకు వెళ్ళేవారు శాస్త్రీయ పద్ధతిలో వాటిని ఉపయోగించాలని నిబంధనలు ఉన్నాయి. మూడు నెలల కాలం ఏది కో సం టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరి గింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ప్ర క్రియ నూతన టెండర్దారుడు చికెన్ సెంటర్‌ల దగ్గర చికెన్ వ్యర్థాలను తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చాం. నిబంధ నలు పాటించ కపోతే వారిపై తగిన చర్య లు తీసుకోవడం జరుగుతుంది.
-మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్