calender_icon.png 9 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పాలకుల నిర్లక్ష్యంతోనే నిధుల వృధా

08-01-2025 11:33:25 PM

భైంసా (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యంతోనే ముథోల్ నియోజకవర్గంలోని ఎత్తి పోతల పథకాల పనులు చేపట్టకుండా నిధులు వృధా కావడమే కాకుండా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారని ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ విమర్శించారు. ముథోల్ మండలం బ్రహ్మణ ఎత్తిపోతల పథకాన్ని బుధవారం సందర్శించారు. 6వేల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకానికి అప్పటి ప్రభుత్వం రూ.80కోట్ల నిధులు వెచ్చించినప్పటికి పాలకుల నిర్లక్ష్యంతో ఉపయోగంలోకి రాకుండా పోయిందని, పథకం విలువైన సామగ్రి దొంగతనానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పథకం ఆశయం నీరుగారిపోయిందన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ప్రస్తావించగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించి రూ.6కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నిధులు విడుదల చేసి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సహాకరించి రైతులకు సాగునీరందించేందుకు పథకాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు.