calender_icon.png 10 October, 2024 | 4:48 PM

మంచికి పోతే చెడు.. ఇళ్ల వదిలి పారిపోయిన మహిళ

10-10-2024 02:52:37 PM

వాషింగ్టన్ లోని ఓ మహిళ మంచితనం ఆమెకే చేటు చేసింది. తాను ఆహారం అందించిన రాకూన్ల దెబ్బతో తన ఇంటిని వదిలి పారిపోవాల్సి వచ్చిందని షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి కెవిన్ మెక్‌కార్టీ తెలిపారు. కిట్సాప్ కౌంటీలోని నివాసిస్తున్న దశాబ్ది కాలం నుంచి ఓ రాకూన్ కుటుంబానికి ఆహారం అందించింది. ఇటీవల కాలంలో వాటి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారి 100 రాకూన్లు ఆమె ఇంటి వద్దకు వచ్చాయి. వాటి ప్రవర్తన ప్రమాదకరంగా మారడంతో వాషింగ్టన్ కు చెందిన మహిళ తన ఇంటిని వదలాల్సివచ్చింది. ఆ తర్వాత అధికారులను ఆశ్రయించి తన గోడును వెలిబుచ్చింది. వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించలేదని నిర్ధారించుకున్న పోలీసులు రాకూన్లను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు.