calender_icon.png 14 March, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశోధక బృందం అనుమానమే నిజమైందా?

11-03-2025 12:00:00 AM

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకేఎన్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించిన చిత్రం ‘ది సస్పెక్ట్’. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ గర్నెపూడి క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. టెంపుల్‌టౌన్ టాకీస్ బానర్‌పై కిరణ్‌కుమార్ నిర్మించారు. విభిన్నమైన కోణం  లో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్‌ను ఎలా కనుగొన్నారు? వారి అనుమానమే నిజమై కేసు ఛేదించ గలిగారా? అనేది ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో చూపించనున్నారు.

మార్చి 21న రిలీజ్ కానున్న ఈ సినిమాను ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య లాంచ్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవేంద్ర; సంగీతం: ప్రజ్వల్ క్రిష్; ఎడిటర్: ప్రవీణ్.