06-03-2025 12:22:16 AM
చంపింది ఆమె ఆడపడుచే!
మలక్‌పేట, మార్చి 5: మలక్‌పేటలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృ తిచెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఆమె భర్త సోదరే మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్టు తేల్చారు. బుధవారం చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్ వివరాలు వెల్లడించారు. మునగాల శిరీష(34) వినయ్‌తో వివాహం అ నంతరం కొన్ని ఆసుపత్రిలో పనిచేసి, మానే సింది.
ఈ విషయమై ఆమె ఆడపడుచు తు మ్మలపల్లి సరిత నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవద్దని శిరీష హెచ్చరిస్తూ పరుషపదజాలంతో దూషించింది. తట్టుకోలేని సరిత.. శిరీషపై చేయి చేసుకుంది. కాగా అప్పటికే అనారోగ్యంతో ఉన్న శిరీష.. గ్లూకో జ్ ఎక్కించేందుకు ఆమె చేయికి క్యానుల తొడిగి ఉన్నది. శిరీష చెయ్యికి ఉన్న క్యానుల ద్వారా మత్తుమందు ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది.
ఆ తర్వాత దిండును శిరీషపై పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడు వినయ్, కుమారుడు నీహాల్‌కు వివ రించింది. వారిద్దరు సాక్ష్యాలను ధ్వంసం చేసి, నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు.
శిరీషకు ఛాతిలో నొప్పి వచ్చిందంటూ నాట తెరలేపారు. అనుమా నంతో మృతురాలి మేనమామ లడే మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. బుధవారం ముగ్గురుని అరెస్టు చేశారు.