calender_icon.png 6 March, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీలో సైబర్ వారియర్స్

05-03-2025 01:11:01 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యామం డలి సరికొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోం ది. ఇటీవలే సైబర్ నేరాలు విపరీతం గా పెరిగిపోవడం, వాటి బారిన పడే బాధితుల సంఖ్య అధికంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సాంకేతికతను అందిపుచ్చుకొని సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ వారియర్స్ ద్వారా అవగాహన కల్పించేలా డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. తద్వారా విద్యార్థులూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది.

తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. రూరల్ స్కిల్ టెక్నాలజీ పార్క్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక పరిశ్రమల అవసరాలు, స్కిల్ బేస్డ్ కోర్సులను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిం చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని భావిస్తోంది.